శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్యను పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు చేపడుతున్నామని... వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పలాస సామాజిక ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. డయాలసిస్ యానిట్‌లో రోగులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రూ.50 కోట్లతో పలాసలో నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రి, కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాన్ని మంత్రులు పరిశీలించారు. బొడ్డపాడులో వ్యాధిగ్రస్థులతో మాట్లాడారు.
ఇదీచదవండి