ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా దాడులు.. మద్యం, గంజాయి, గుట్ఖా రవాణా చేస్తున్న వారిపై కేసులు - latest news of ganja

రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ సిబ్బంది.. గంజాయి, నాటుసారా, అక్రమంగా మద్యం రవాణా వంటి చర్యలపై కఠినంగా స్పందించారు. చట్ట విరుద్ధమైన చర్యలు సహించేది లేదని తేల్చి చెప్పారు.

enforcement officers raids on ganja,natusara, illegal liquor centers in districts of the andhrapradesh

author img

By

Published : Aug 26, 2020, 8:01 PM IST

రాష్ట్రంలో ఎన్పోర్స్ మెంట్ అధికారుల విస్తృత దాడులు

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 220 లీటర్ల నాటుసారా తరలిస్తున్న వ్యక్తులను గుర్తించి స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేసి 4 లీటర్ల నాటుసారా, 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

కడప జిల్లా బద్వేల్ మండలం మల్లం పేట గ్రామ వ్యవసాయ పొలాల్లో బద్వేలు గ్రామీణ ఎస్​ఐ కృష్ణయ్య... సిబ్బందితో కలిసి దాడులు చేశారు. నాటు సారా కాస్తున్న జోగిరెడ్డి పల్లికి చెందిన ప్రసాద్, వెంకటేశ్, సాంబశివారెడ్డిలను అరెస్టు చేశారు. 7 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. 872 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సంగడిగుంట మొదటి లైన్లో రెండు ఆటోల్లో మద్యాన్ని గుర్తించారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద జాతీయ రహదారిపై గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న 2,980 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు.

కృష్ణా జిల్లా జొన్నలగడ్డ చెక్‌పోస్ట్‌ వద్ద 193కేజీల గంజాయిని.. నందిగామ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ 3 లక్షల 86 వేలుగా అంచనా వేశారు. 30 వేల నగదు, రవాణాకు ఉపయోగించిన కారు, 5 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామం వద్ద కారులో తరలిస్తున్న 11 లక్షల విలువచేసే గుట్కాలు, 4 కేజీల గంజాయి, 24 మద్యం సీసాలు నందిగామ పోలీసులు పట్టుకున్నారు. కారు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసినట్లు నందిగామ డీఎస్పీ రమణ మూర్తి వెల్లడించారు.

విశాఖ జిల్లా చీడికాడ మండలం చీడిపల్లి గ్రామంలో 80 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 14 మందిని అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. చీడికాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఏడుగురికి వైరస్ సోకినట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఏడుగురిని ఆసుపత్రికి తరలించి, మిగిలిన వారిని రిమాండుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు... వెబ్‌సైట్‌ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.