ETV Bharat / state

దీపావళి.. పండుగే కాదు... ఓ గ్రామం పేరు కూడా..! - news of diwali village in srikakulam

దీపావళి... పండగ కాదు ఓ గ్రామం! అదేంటి అని ఆలోచిస్తున్నారా? దీపావళి అంటే దేశ ప్రజలు అత్యంత ఘనంగా చేసుకునే పండగ కదా.. ఊరంటారేం అనే సందేహం తలెత్తుతోంది కదా. అయితే.. ఇదే మీకు మా సమాధానం. సిక్కోలు జిల్లాలోని దీపావళి గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Diwali village in the Srikakulam district
author img

By

Published : Oct 27, 2019, 10:41 PM IST

Updated : Oct 27, 2019, 11:50 PM IST

శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీ పరిధిలో దీపావళి అనే గ్రామం ఉంది. చరిత్ర ఆధారంగా చూస్తే.. దశాబ్దాల కిందట శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఆ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళాన్ని అప్పట్లో సిక్కోలుగా పిలిచేవారు. అప్పటి సిక్కోలు రాజు కళింగపట్నం ప్రాంతానికి గుర్రంపై అప్పుడప్పుడూ ఆ గ్రామం మీదుగా వెళ్లేవారు. ఒక రోజు విహారంలో ఉండగా.. కొబ్బరితోటలోని విష్ణు దేవాలయ సమీపంలో ఎండ తీవ్రతకు స్పృహ తప్పి పడిపోయారట. సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు రాజు గారిని గుర్తించి సపర్యలు చేశారట. రాజు కోలుకున్న తర్వాత వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారట. అదే రోజు దీపావళి పర్వదినం కావడం వల్ల.. ఆ సందర్భానికి గుర్తుగా గ్రామానికి రాజుగారు దీపావళి అని నామకరణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి ఆ గ్రామం పేరు దీపావళిగా కొనసాగుతోంది. రెవిన్యూ రికార్డుల్లో కూడా దీపావళిగానే నమోదైంది.

దీపావళి.. పండగే కాదు... ఓ గ్రామం పేరు కూడా..!

300 గృహాల సముదాయం..వెయ్యి మంది జనాభా

శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీ పరిధిలోలో ఉన్న దీపావళి గ్రామంలో సుమారు 300 గృహాలతో వెయ్యి మంది జనాభా ఉంటున్నారు. ఈ గ్రామం దీపావళిగా ప్రాచుర్యం పొందటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరు.. తమ గ్రామానికి పేరు కలిగి ఉండటం సంతోషంగా ఉందంటున్నారు. ఈ గ్రామంలోని మరో విశేషమేంటంటే.. దీపావళి పండగ రోజే పూర్వీకులకు పిండ ప్రదానం చేయటం.

శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో ఒక్కటే కాదు మరో గ్రామం కూడా ఉంది. ఒకటి గార మండలంలో ఉంటే..మరొక్కటి టెక్కలి మండలం అయ్యోధ్యపురం గ్రామ పంచాయతీ పరిధిలోనూ దీపావళి అనే ఊరు ఉంది.

ఇదీ చదవండి:

ఐఎస్​ అగ్రనేత బాగ్దాదీ హతం.. అమెరికా ప్రకటన

AP_SKLM_02_27_DEEPAVALI_VILLAGE_PKG_AP10172 FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM. OCT 27 ---------------------------------------------------------------------------- యాంకర్:- భారతీయులు అత్యంత వేడు కగా జరుపుకొనే పండగ.. దీపావళి . ఈ పండగ పేరుతో సిక్కోలులో ఓ గ్రామం ఉంది. వందల సంవత్సరాల నాటి చరిత్ర అధారంగానే ఈ గ్రామానికి దీపావళి ఊరు పేరుగా నామకరణ అయ్యింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామం పేరు ఏలా వచ్చిందో తెలుసుకుందామా......(Look). 1.VO:- సిక్కోలులో హిందువుల పండుగ దీపావళి పేరిట గ్రామం వెలిసింది. దశాబ్దాల కిందట శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళాన్ని అప్పట్లో సిక్కోలుగా పిలిచేవారు. సిక్కోలు రాజు కళింగపట్నం ప్రాంతానికి గుర్రం పై అప్పుడప్పుడు ఇదే ప్రాంతం మీదుగా వెళ్లేవారు. ఒక రోజు ఎండ తీవ్రతకు గుర్రంపై వెళ్తున్న రాజు.. కొబ్బరి తోటలోని విష్ణు దేవాలయం సమీపంలో స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు, ఈ సమీపంలోని ఆలయంలో భక్తులు రాజును గుర్తించి సపర్యలు చేశారు. రాజు కోలుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే రోజు దీపావళి పర్వదినం కావడంతో దాన్ని గుర్తు చేసుకున్న రాజు... ఈ గ్రామానికి దీపావళి నామకరణం చేస్తునట్లు ప్రకటించారు. దీంతో అప్పటినుంచి ఈ గ్రామం దీపావళిగా కొనసాగుతోంది. రెవెన్యూ రికార్డుల్లో సైతం దీపావళిగానే నమోదు అయ్యింది. దీపావళి పండగకు కూడా గ్రామస్తులంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనడం ఆనవాయితీగా వస్తోంది.......(Vis+Music). 2.VO:- శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీ పరిధిలో దీపావళి గ్రామంలో సుమారు 3వందల గృహాలతో సుమారు వెయ్యి జనాభా ఉంటున్నారు. ఈ గ్రామం దీపావళిగా ప్రాచుర్యం పొందడం ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు. హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరుతో మా గ్రామానికి పేరు కలిగి ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి గ్రామంలో జన్మించిడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. దీపావళి పండగను గ్రామస్థులంతా ఆనందోత్సాహలతో జరుపుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే అందరూ సంక్రాంతికి చేసే పూర్వీకులకు పిండ ప్రధానం.. ఈరోజే చేయడం ఇక్కడ అనావాయితీ.......(Bytes). 1. బైట్:- ‌శ్రీరంగం మధుసూదనరావు, దీపావళి, శ్రీకాకుళం జిల్లా. 2. బైట్:- సిమ్మ ధర్మరాజు, దీపావళి మాజీ సర్పంచ్‌, శ్రీకాకుళం జిల్లా. 3. బైట్:- చల్లా అంజనేయులు, దీపావళి, శ్రీకాకుళం జిల్లా. EVO:- సిక్కోలులో దీపావళి పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి. ఒకటి గార మండలంలో ఉంటే... మరొకటి టెక్కలి మండలం అయోధ్యపురం గ్రామ పంచాయతీ పరిధిలో దీపావళి అనే గ్రామం ఉంది.....(Over).
Last Updated : Oct 27, 2019, 11:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.