రణస్థలం మండలం దేరసాం గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను తెదేపా నాయకుడు కె.అప్పలనాయుడు పరామర్శించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. అనుకోని ప్రమాదంతో సర్వం కోల్పోయాయని, కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఇళ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నివాసం కోల్పోయిన వారికి బియ్యం, కూరగాయలు, దుస్తులు, నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేరసాంలో అగ్నిప్రమాదం... 12పూరిళ్లు దగ్ధం