ETV Bharat / state

పోస్టుమార్టం ఆలస్యం.. బంధువుల ఆందోళన.. కారణం ఏంటంటే..! - జనసేన

Autopsy: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలో వేచి చూసినా.. మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించలేదు. దీంతో మృతుని బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం ఆలస్యానికి గల కారణమేంటని ఆరా తీయగా.. ఆ ప్రక్రియ నిర్వహించాల్సిన వైద్యుడు సినిమాకు వెళ్లాడంటా. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 26, 2022, 8:08 PM IST

Agitation Due To Autopsy Delay: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలోని వైద్యులు.. పోస్టుమార్టం చేయటంలో అలసత్వం వహిస్తున్నారని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. ఇచ్చాపురం పట్టణానికి చెందిన 36 ఏళ్ల మనోజ్ సాహు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య రశ్మిత, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉదయం 11 గంటలకు పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభించలేదు.

పోస్టుమార్టం చేయాల్సిన వైద్యుడు సినిమాకి వెళ్లిపోయాడని,.. ఉదయం నుంచి వేచి చూస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని మృతుని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జనసేన, తెదేపా నేతలు ఆసుపత్రి వద్దకు చేరుకుని.. వైద్య సిబ్బందిని నిలదీశారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని.. మృతుని బంధువులకు సర్దిచెప్పారు. విధుల్లో ఉన్న మహిళా డాక్టర్ పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించడంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.