శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో కొందరు వీరంగం సృష్టించారు. మద్యం సేవించి ఇళ్లపై రాళ్లు, సీసాలు విసిరారు. ప్రశ్నించిన స్థానికులపై దాడికి దిగారు. ఈ ఘటనతో పలువురు భక్తులు భయాందోళనకు గురయ్యారు.
టెక్కలి నుంచి వచ్చిన కొందరు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమీపంలోని తోటలో మద్యం సేవించారు. మత్తులో స్థానిక ఇళ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ బరికో అనే వ్యక్తి కుటుంబీకులకు గాయాలయ్యాయి. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమీర్ ఆలీ తెలిపారు.
ఇదీ చదవండి: