ETV Bharat / state

ఆ మంత్రి సొంత జిల్లాలో అసంపూర్తిగా అభివృద్ధి పనులు..!

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నా... జిల్లాలో రహదారులు, వంతెనలు దైన్యస్థితికి చేరుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వంతెనలు, రహదార్ల నిర్మాణం ప్రస్తుతం ఆగిపోయాయి. వైకాపా ప్రభుత్వం మరికొన్ని రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదించినా... నిర్మాణంలో ఏవీ ముందుకు సాగటం లేదు. కోట్లాది రూపాయల బకాయిల కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

అమాత్య సొంత జిల్లాలో అసంపూర్తిగా అభివృద్ధి పనులు !

author img

By

Published : Jun 9, 2020, 12:59 PM IST

గుత్తేదారులకు రోడ్లు భవనాల శాఖ నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లాలో పనులను నిలిపివేశారు. దాదాపు అన్ని రహదారులు, వంతెనలు, భవనాల నిర్మాణాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా గుత్తేదారులకు 150 నుంచి 200 కోట్ల మేరకు బకాయిలున్నాయి. ఏడాది కాలంగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో ఇక తాము ఏమీ చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మంత్రి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొనటం కారణంగా... రోడ్లు భవనాల శాఖ అధికారుల తలలు పట్టుకుంటున్నారు.

వంశధార నదిపై రెండు వేరువేరు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించడం వల్ల అంతర్ రాష్ట్ర రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావించి గత ప్రభుత్వం నిధులు సమకూర్చింది. రూ.72 కోట్లతో పోలాకి మండలం వనిత నుంచి గార మండలం గార వరకు నదిపై వంతెన నిర్మాణం చేపట్టింది. కానీ ఏడాదిన్నర కాలంగా పనులు నిలిచిపోయాయి. ఈ వంతెన నిర్మాణానికి సంబంధిత గుత్తేదారుకు రూ.12 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. దీంతో వంతెన నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ రెండు మండలాల నడుమ వంతెన పూర్తయితే జిల్లా కేంద్రం శ్రీకాకుళం నుంచి సముద్ర తీరానికి సమాంతరంగా రాకపోకలు వీలుంటుంది.

అలాగే వంశధార నదిపై జలుమూరు మండలం కొమనాపల్లి-సరుబుజ్జిలి మండలం తెలుగుపెంట గ్రామాల నడుమ వంతెన కోసం గత ప్రభుత్వం రూ.48 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది. దాదాపు ఐదేళ్లు కావస్తున్నా.. ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తి కాలేదు. నదిపై వంతెన నిర్మాణం పూర్తయినా అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో వంతెన నిర్మాణానికి సార్థకత లేకుండాపోయింది. ఈ వంతెన నిర్మించే గుత్తేదారులకు ఎనిమిది కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది.

ఇక రహదారులకు విషయానికి వస్తే ప్రధాన రహదారులు గోతుల మయంగా మారాయి. జాతీయ రహదారి నుంచి బద్రి వరకు 24 కిలోమీటర్ల మేర రూ. 25 కోట్లతో నిర్మించాల్సిన రహదారి పనులు నిలిచిపోయాయి. ఈ రహదారి నిర్మించే గుత్తేదారులకు దాదాపు ఏడు కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది . అదేవిధంగా లుకలాం కొమనాపల్లి రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్లతో పనులు ప్రారంభించగా ...అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. ఈ రహదారి గుత్తేదారులకు నాలుగు కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉంది. రూ.120 కోట్లతో నిర్మిస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పనులు నిలిచిపోయాయి. మెయింటెనెన్స్, ప్యాచ్ వర్క్ తదితర పనులు కూడా చేపట్టలేక పోతున్నారు.

మంత్రి సొంత నియోజకవర్గం నరసన్నపేట కేంద్రంలో రూ.4.3 కోట్లతో మంజూరైన రహదారి అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో 150 నుంచి 200 కోట్ల మేర గుత్తేదారులకు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఒక అంచనా. దీనిపై ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కే.కాంతిమతి వద్ద ప్రస్తావించగా బిల్లుల చెల్లింపు లేక పనులు నిలిచిపోయాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.