కరోనా నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ నివాస్తో కలిసి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు.
దేశంలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రం మనదేనన్నారు. జిల్లా కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అత్యుత్తమ సేవలు అందించిందని సభాపతి తమ్మినేని సీతారాం ప్రశంసించారు. ప్రభుత్వ చర్యల ఫలితంగానే కరోనా తీవ్రత తగ్గిందన్నారు.
ఇదీ చదవండి