టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఎక్కువ పతకాలు సాధించి విజేతగా నిలవాలని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్ క్రీడలలో పాల్గొనేందుకు వెళుతున్న క్రీడాకారులకు సంఘీభావం ప్రకటించే చీర్ అప్ ఇండియా కార్యక్రమాన్ని.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఘన విజయాన్ని సాధించాలని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కృష్ణదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో రాణించాలనేది తన ఒక్కడి ఆకాంక్ష మాత్రమే కాదని, 130 కోట్ల భారత ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశ క్రీడాకారులు 18 క్రీడాంశాల్లో 127 మంది బరిలోకి దిగుతున్నారన్న కృష్ణదాస్.. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ఇదే అతి పెద్ద బృందమని తెలిపారు.
ఇదీ చదవండి: