శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వాలంటీర్లకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ వాలంటీర్లు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య సమన్వయ కర్తగా పనిచేయాలని సూచించారు. నిబద్ధత, నిజాయితీ తమ ప్రభుత్వ పాలన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇది మన ముఖ్యమంత్రి పాలనలోనే సాధ్యమైందనీ కొనియాడారు.
ఇదీ చూడండి: