శ్రీకాకుళంలో వస్త్ర దుకాణాలు, మార్కెట్లు రద్దీగా మారాయి. సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని షాపులకు వచ్చిపోయే జనంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులుగా ఉంటూ కొనుగోళ్లు చేస్తున్నారు. ఏడు రోడ్ల కూడలి నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రద్దీ కొనసాగింది.
ఇదీ చదవండి: ఆకట్టుకున్న జానపద కళా జాతర ప్రదర్శన