ETV Bharat / state

కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి: సీపీఎం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలపై... ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీకాకుళం జిల్లా రాజాంలో సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని... సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయుడు అన్నారు.

cpm party protest in srikakulam district
కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి: సీపీఎం
author img

By

Published : Nov 7, 2020, 10:50 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలపై... ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీకాకుళం జిల్లా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయుడు అన్నారు. రాజాంలో రాజకీయ చైతన్య ప్రచారోద్యమాన్ని చేపట్టారు. అనంతరం నగర పంచాయతీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పాదయాత్ర జయప్రదం చేయాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని... కార్మిక చట్టాల సరళీకరణ ఆపాలని రామ్మూర్తినాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపా పార్టీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

సౌర విద్యుత్ ప్రాజెక్టు మార్గదర్శకాల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.