శ్రీకాకుళం జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై.. ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 32వ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను రవాణాశాఖ ఉప కమిషనర్ సుందర్‌తో కలిసి విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రవాణాశాఖ ఆధ్వర్యంలో.. ఫిబ్రవరి 17 వరకు నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందన్నారు.
విద్యార్ధులకు అవగాహన..
ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు ముఖ్యంగా యువతకు రహదారి భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్ధులకు సైతం అవగాహన కలిగించనున్నట్లు రవాణాశాఖ ఉప కమిషనర్ తెలిపారు. జిల్లాలో 120 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండటంతో.. ప్రమాదాలు జరగకుండా ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్ బర్ధార్ ద్విచక్రవాహనాల అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఇవీ చూడండి...