ETV Bharat / state

'ఈటీవీభారత్' ఎఫెక్ట్: ఇద్దరు రిటర్నింగ్ అధికారులు సస్పెన్షన్​

author img

By

Published : Feb 12, 2021, 7:55 PM IST

Updated : Feb 12, 2021, 8:02 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేటలో ఓటు హక్కు వినియోగించుకున్న బ్యాలెట్‌ పత్రాలు బయటపడిన ఘటనలో... రిటర్నింగ్​ అధికారులను సస్పెండ్​ చేస్తూ కలెక్టర్ నివాస్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై 'బయట దొరికిన.. ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు!' శీర్షికన 'ఈటీవీ భారత్'​ కథనం ఇచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

'ఈటీవీభారత్' ఎఫెక్ట్: ఇద్దరు రిటర్నింగ్ అధికారులు సస్పెండ్

శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్​పేటలో ఇటీవల ఓటు హక్కు వినియోగించుకున్న బ్యాలెట్‌ పత్రాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై 'ఈటీవీభారత్', 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్​'​లో 'బయట దొరికిన.. ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు!' శీర్షికన కథనాలు వచ్చాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. రిటర్నింగ్​ అధికారులను సస్పెండ్​ చేస్తూ... కలెక్టర్ నివాస్​ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ పేపర్లను భద్రపరచడం, అప్పగించడంలో.. రిటర్నింగ్​ అధికారి నిర్లక్ష్యం వహించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎల్ఎన్​పేట గ్రామ పంచాయతీ స్టేజ్-2 రిటర్నింగ్ అధికారి ఎల్.గోవర్ధనరావుతో పాటు రిజర్వు రిటర్నింగ్​ అధికారి వి.మల్లేష్​ను సస్పెండ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అనుమతి లేకుండా మండల కేంద్రం విడిచి వెళ్లొద్దని కలెక్టర్ నివాస్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... 'ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం'

Last Updated : Feb 12, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.