CM Jagan Help A Sick Girl: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో ఓ బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. రేగిడి మండలం చిన్న సిర్లం గ్రామానికి చెందిన మీసాల ఇంద్రజ అనే ఏడేళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. పుట్టిన నాటి నుంచే ఆమె తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమె ఆరోగ్యం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. ఇప్పటికే రూ.4 లక్షల వరకు ఖర్చు చేసి.. శస్త్ర చికిత్స చేయించారు. మరోవైపు బాలిక తండ్రి అప్పలనాయుడు కిడ్నీ వ్యాధిగ్రస్తుడు. దీంతో ఇంద్రజ తల్లి కృష్ణవేణి.. సామాజిక కార్యకర్త సిద్ధార్థ సహాయంతో ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి.. నరసన్నపేటకు వచ్చారు.
నరసన్నపేటలో సీఎంజగన్ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నిరాశగా ఉన్న సమయంలో.. ఆ వైపుగా వెళుతున్న కాన్వాయ్ నుంచి ముఖ్యమంత్రి జగన్ గుర్తించి.. వాహనం దిగి ఇంద్రజ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వెంటనే కలెక్టర్ శ్రీకేష్ లట్కర్ని పిలిచి ..వైద్య సహాయం అందించాలని, ఆమెకు పది వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: