శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పందిగుంటలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తాగునీటి బోరు విషయంలో వివాదం తలెత్తగా... కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ముగ్గురిని శ్రీకాకుళం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఘటనతో పందిగుంట గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి