ETV Bharat / state

వైకాపా పాలకులకు కూల్చడం తప్ప, కట్టడం రాదు: చంద్రబాబు

author img

By

Published : Mar 27, 2022, 5:46 PM IST

వైకాపా పాలకులకు కూల్చడం తప్ప కట్టడం రాదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్న ఆయన.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పిల్లల పార్కును కూల్చివేయటం దారుణమన్నారు.

వైకాపా పాలకులకు కూల్చడం తప్ప కట్టడం రాదు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలకు అడ్డేలేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కూల్చడం తప్ప.. కట్టడం రాని పాలకుల వైఖరితో రాష్ట్రంలో శిథిలాలే మిగులుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్‌లో కూల్చివేతలు దారుణమని ట్వీట్‌ చేశారు. వైకాపా బరితెగింపును అడ్డుకోలేని అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైకాపాకు ఓట్లేసింది ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు కాదని గుర్తించాలని చంద్రబాబు హితవుపలికారు.

  • రాష్ట్రం లో వైసీపీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. కూల్చడం తప్ప కట్టడం రాని ఈ పాలకుల వైఖరితో శిథిలాలే మిగులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో నిర్మాణం లో ఉన్న ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్ లో కూల్చివేతలు దారుణం.(1/2) pic.twitter.com/PEd6UfwCzu

    — N Chandrababu Naidu (@ncbn) March 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్కు కూల్చివేత: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మాణదశలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్‌ పార్కును కొందరు కూల్చివేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైన ఈ పార్కు స్థలంపై కొందరు కన్నువేసి శనివారం వేకువజామున రెండు జేసీబీలతో పడగొట్టారు. ఇందిరానగర్‌ కాలనీలోని విలువైన ఈ స్థలాన్ని కొన్నేళ్లుగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న పార్కు ప్రహరీ, రీడింగ్‌ రూం, కార్యాలయ గదులను కూల్చడంతో పాటు అంతర్గత రహదారులను ఛిద్రం చేశారు. విద్యుత్ తీగలను తొలగించారు. ఈ సమాచారం తెలియగానే మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.. కొందరు తెదేపా కార్యకర్తలను అక్కడకు పంపారు. కూల్చివేతను చేపట్టిన వారు తెదేపా కార్యకర్తలపై దాడి చేశారు. వారు భయపడి పరుగులు తీశారు. రమణమూర్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకొని కూల్చివేతను అడ్డుకొని యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే చాలా నిర్మాణాలు పాడయ్యాయి. రమణమూర్తితో పాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన తెలపడంతో పాటు ధర్నా చేశారు.

కలెక్టర్‌ అనుమతులతో..: పార్కు నిర్మాణానికి అప్పటి కలెక్టర్‌ అనుమతులు మంజూరు చేయగా, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో పనులు మొదలయ్యాయి. దాదాపు రూ.2 కోట్ల వ్యయం అవుతుందని భావించారు. నరసన్నపేట గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.34.50 లక్షలు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీకి చెందిన ఈ స్థలం తమకే మంజూరైందంటూ 15 మంది కోర్టును ఆశ్రయించారు. పలుమార్లు పిటిషన్లు వేయడంతో పార్కు నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరగక, రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు.

దోషుల్ని అరెస్టు చేయాలి...: వైకాపా ప్రభుత్వ హయాంలో పార్కులకూ రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల పార్కుపై పెద్దల కళ్లు పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దోషులను అరెస్టు చేసి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కోరారు. నరసన్నపేట మేజర్‌ పంచాయతీ వార్డు సభ్యుడు బి.ఎల్‌.శర్మతో పాటు 15 మంది ప్రమేయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుస్టేషన్‌ వద్ద తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి.

ఇదీ చదవండి: మాట తప్పిన సీఎం జగన్ రాజీనామా చేయాలి : మాజీ మంత్రి పత్తిపాటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.