ETV Bharat / state

Bronze and Brass Statue Makers : "కంచు" కళ కొనసాగేనా...?? - కంచు, రాగి, ఇత్తడి విగ్రహాలు, పాత్రల తయారీదారులు

Bronze and Brass Statue Makers : కంచు, రాగి, ఇత్తడి విగ్రహాలు, పాత్రల తయారీకి.. రాష్ట్రంలోనే ఆ ప్రాంతం పెట్టింది పేరు! పూర్వీకుల నుంచి ఈ వృత్తినే వారి వారసులు పుణికిపుచ్చుకున్నారు. కానీ.. క్రమంగా ఇప్పుడు వీటిని తయారు చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. శ్రీకాకుళం జిల్లా బుడితి ఇత్తడి కళాకారుల కష్టాలపై ప్రత్యేక కథనం..

Bronze and Brass Statue Makers
కంచు కళ కొనసాగేనా...??
author img

By

Published : Jan 1, 2022, 3:59 PM IST

Bronze and Brass Statue Makers : కంచు, రాగి, ఇత్తడి విగ్రహాలు, పాత్రల తయారీకి రాష్ట్రంలోనే ఆ ప్రాంతం పెట్టింది పేరు. పూర్వీకుల నుంచి ఈ వృత్తినే వారి వారసులు పుణికిపుచ్చుకున్నారు. కానీ క్రమ క్రమంగా ఇప్పుడు వీటిని తయారు చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. కరోనాతో ఆర్డర్లు లేక కొంత మంది కళాకారులు వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు. శ్రీకాకుళం జిల్లా బుడితి ఇత్తడి కళాకారుల కష్టాలపై ప్రత్యేక కథనం...

కంచు కళ కొనసాగేనా...??

చూడచక్కని విగ్రహాలు, పాత్రలు తయారుచేస్తున్న వీరంతా శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితికి చెందిన కంచు, ఇత్తడి కళాకారులు. ఒకప్పుడు ఈ గ్రామంలో వందకు పైగా కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకొని బతికేవి. ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేవలం 20 కుటుంబాల వారు మాత్రమే విగ్రహాలు, పాత్రలను తయారుచేస్తున్నారు. ఎన్నో కళాఖండాలు వీరి చేతిలో ప్రాణం పోసుకున్నా వీరి బతుకుల్లో మాత్రం పెద్దగా వెలుగులు లేవు. కరోనాతో ఆర్డర్లు మందగించి అరకొర సంపాదనతోనే వీరంతా నెట్టుకొస్తున్నారు.

బిందెలు, దేవతామూర్తుల విగ్రహాలు, ధ్వజ స్తంభాలు, పూల కుండీలు, గంటలు ఇలా ఎన్నింటినో చెక్కడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్న ఈ కళాకారులు క్రమంగా తమ వృత్తి అంతరించిపోతోందని బాధపడుతున్నారు. దేశ విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నా ఈ వృత్తిని స్వీకరించే వారు లేరని వాపోతున్నారు.

ప్రభుత్వం పనిముట్లు అందిస్తే మరింత కళాత్మకంగా విగ్రహాలు తయారుచేస్తామని ఇత్తడి కళాకారులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న తమను ఇతర కళాకారుల మాదిరే పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

" 2006 నుంచి ఈ పని మేము చేస్తున్నాం. నా భర్త తరుపు వారు తాతల తండ్రుల నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాం. ఇతర దేశాలకు కూడా ఈ కళాఖండాలను పంపుతాము. దేశ వ్యాప్తంగా పలు ఎగ్జిబిషన్లలో కూడా పాల్గొని ప్రశంసలు పొందాం. వివిధ నగరాలకు కూడా వీటిని పంపిస్తాము. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆర్డర్ పై వీటిని తయారు చేశాం. " - సూర్యకళ, చేతి వృత్తి కార్మికురాలు

" మా తాతలు తండ్రుల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. సుమారు 100 కుటుంబాలు ఈ పనే చేసేవి. సరైన పనులు లేక అంతా వలసలు వెళ్లిపోయారు. అన్ని రకాల విగ్రహాలు, గృహాలంకరణ వస్తువులు మేము తయారు చేస్తాం." - అద్దాల రామకృష్ణ, చేతివృత్తి కార్మికుడు

" నాలుగైదు నెలలకు ఒకసారి ఆర్డర్ వస్తుంది. దీంతో వేరే పనులు చేయాల్సి వస్తుంది. పనికి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ...ఈ వృత్తికి పెద్దగా ఆదరణ అయితే లేదు. " - కింతాడి జనార్ధన్ రావు, చేతివృత్తి కార్మికుడు

" పాత కళాకారుల్ని బతికించుకోవాలంటే ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. వారి వద్ద కొత్త వారికి శిక్షణ ఇప్పించగలిగితే కళ బతుకుంది. వారికి చేయూత అవుతుంది. " -పాటురి శ్రీనివాస్ ఆచారి, చేతివృత్తి కార్మికుడు

ఇదీ చదవండి : ELEPHANTS DESTROYING CROPS: పంటలపై ఏనుగుల గుంపు దాడి..రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.