కంచిలి మండలం గొల్ల కంచలి గ్రామంలో నాటు బాంబులు లభించాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో 40 నాటు బాంబులు బయట పడ్డాయి. అయితే ఇటీవలే ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఆధిపత్యం కోసం ఓ వర్గం వారు వీటిని ఒరిస్సా నుంచి తెప్పించినట్టు పలువురు పోలీసులు భావిస్తున్నారు.
దీనిపై విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామి రెడ్డి తెలిపారు. అడవి పందులను చంపడానికి.. వీటిని వినియోగిస్తున్నట్లు పలువురు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని కంచలి పోలీసులు పరిశీలించారు.
ఇదీ చదవండీ... దుర్గమ్మ చెంతన... అయినవారిదే రాజ్యం!