భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని భాజపా నేత విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో భాజపా ప్రభుత్వ ఎడాది పాలన కరపత్రాలను విష్ణుకుమార్‌రాజు విడుదల చేశారు. నేటి నుంచి 22వ తేదీ వరకు ఈ కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. అనంతరం సూర్యమహల్ కూడలిలో నిర్వహించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సారా మత్తులో.. గర్భిణి అని చూడకుండా భార్యను హత్య చేశాడు'