మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అనిశా అధికారులు అత్యంత దారుణంగా తీసుకువెళ్లారని భాజపా నేత విష్ణు కుమార్‌రాజు మండిపడ్డారు. పోలీసులు గోడ దూకి వెళ్ళడం సరైన పద్ధతి కాదని విష్ణు కుమార్‌రాజు అన్నారు.
అచ్చెన్నాయుడు టెర్రరిస్ట్, సంఘ విద్రోహ శక్తి కాదని... దేశాన్ని విడిచిపోయే ఆర్ధిక నేరస్థుడు అంతకంటే కాదన్నారు. అచ్చెన్నాయుడు పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరును తాము నిరసిస్తున్నామని అన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
తెదేపా ఎమ్మెల్యే పై వైకాపా వర్గీయుల రాళ్లదాడి... కార్యకర్తలకు గాయాలు