శ్రీకాకుళం జిల్లా గార మండలంలో మత్స్యకారుల వలలకు సొరచేప చిక్కింది. బందరువానిపేట, కొమరవానిపేట జాలర్లు చేపల కోసం వేసిన వలలో 25 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 2 టన్నుల బరువున్న పులిబజ్జల సొర చేప పడింది. జాలర్లు.. వలలు కోసి చేపను రక్షించే ప్రయత్నించారు. అయితే అప్పటికే అది చనిపోయింది. ఈ పులిబజ్జల సొర చేపను చూసేందుకు స్థానికులు సముద్ర తీరానికి తరలివచ్చారు.
ఇదీ చూడండి:
సంక్రాంతి పండుగకు అరకొరగానే కొనుగోళ్లు... నిరాశలో వ్యాపారులు