శ్రీకాకుళం జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట తెలుగుదేశం పార్టీ, వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రామలక్ష్మణ కూడలి వద్ద బైక్ ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంద్ కారణంగా జిల్లాలోని వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి.
ఆమదాలవలసలో భారత బంద్..
ఆమదాలవలసలో భారత బంద్ సందర్భంగా.. తెదేపా నాయకులు, సీఐటీయు నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నూకరాజు, తెదేపా నాయకులు తమ్మినేని విద్యాసాగర్, మొదలవలస రమేష్ లతోపాటు నాయకులు కార్యకర్తలు, సీఐటీయు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి..