ETV Bharat / state

వజ్రపుకొత్తూరు నాయబ్ తహసీల్దార్​పై దాడి - ఉపతహసీల్దార్ పై దాడి వార్తలు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న... నాయబ్ తహసీల్దార్‌ మురళీకృష్ణపై అదే మండలానికి చెందిన అక్కుపల్లి గ్రామస్థుడు పి.జంగమయ్య దాడి చేసి గాయపరిచాడు.

attack on vis mro in srikakulam dst vajrapukotthuru

author img

By

Published : Jul 5, 2020, 5:14 PM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ‌ మురళీకృష్ణపై అక్కుపల్లి గ్రామస్థుడు పి.జంగమయ్య హెల్మెంట్​తో దాడి చేసి గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవింద్ తెలిపారు.

భూమి హక్కులకు సంబంధించిన పేర్లును వెబ్‌ల్యాండ్‌ ఆన్‌లైన్‌ రిజిస్టర్‌లో మార్చాలని నాయబ్ తహసీల్దార్‌తో నిందితుడు జంగమయ్య వాదనలకు దిగాడు. అనంతరం దాడి చేశాడని పోలీసులు తెలిపారు. బాధితునికి పలాస సామాజిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

భౌతికదాడికి పాల్పడటం తగదు

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై భౌతికదాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వజ్రపుకొత్తూరు తహసీల్దార్‌ జీవీ నారాయణమూర్తి అన్నారు. ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి కాని ఇలా దాడి చేయటం సరికాదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి

అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.