ETV Bharat / state

సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకాయి. బంగారు వర్ణంలో స్వామివారి అందాలు ద్విగుణీకృతమైయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.

arasavalli-suryanarayana-temple
author img

By

Published : Oct 2, 2019, 9:39 AM IST

సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు స్పృశించాయి. రవికిరణాలు.... పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకే అపురూప ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. తెల్లవారుఝాము నుంచే వేచి ఉన్న భక్తులకు.. 6 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే భాగ్యం కలిగింది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో సూర్యకిరణాలు స్వామివారిని తాకడం ఇక్కడ ఆనవాయితీ. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ ఘట్టం …..ఏటా మార్చి 9, 10 తేదీల్లో... అలాగే అక్టోబర్ 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తోంది. ఇవాళ సాక్షాత్కారమైన ఈ అపురూప దృశ్యాన్ని చూసి.. భక్తులు పరవశులయ్యారు. తన్మయత్వం పొందారు.

Intro:Body:

తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి మహాత్మా గాంధీ 150వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. భరతమాత ముద్దుబిడ్డ బాపు జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. గాంధీ జన్మదినాన్ని ఏటా 'అహింసా దినోత్సవం'గా జరుపుకొంటున్నామన్న చంద్రబాబు.. మహాత్ముడు ఆచరించి చూపిన అహింస, శాంతి నేడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని చెప్పారు.

''మహాత్ముని స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంగా మారింది. గాంధీజీ లాంటి వ్యక్తి మన దేశంలో జన్మించడం మనం చేసుకున్న అదృష్టం. గాంధీ జయంతి సందర్భంగా ఆయన సేవలు మననం చేసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.