- సంప్రదాయ విధానం అనుమతించబోము.. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీసులోనే..
సంప్రదాయ విధానంలో కాగితాల ద్వారా దస్త్రాల్ని పంపడం, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడాన్ని అనుమతించబోమని సీఎస్ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీసులోనే చేయాలని ఆదేశించారు.
- మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు..తీర్పు వాయిదా..!
చిట్‌ఫండ్స్ చట్ట నిబంధనల మేరకు..మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో.. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకుకోకుండా రిజిస్ట్రార్లను ఆదేశించాలని సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి.. తీర్పు..!
- వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు పంపించండి.. కేంద్రాన్ని కోరిన విడదల రజని
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కరోనా కట్టడి చర్యలపై కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయాతో వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రానికి వ్యాక్సిన్లు పంపించాలని విజ్ఞప్తి చేశారు.
- ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి :ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిపై ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5 డీఏ బకాయిలు జమకాలేదన్నారు. రెండేళ్లుగా సరెండర్ లీవులు, జీపీఎఫ్ డబ్బులు, ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్లులు ఏవీ చెల్లింపులు చేయలేదు. జనవరి 15 వరకు నిరీక్షిస్తాం అప్పటీకి ప్రభుత్వం స్పందించకుంటే..అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు.
- దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్‌లో లక్షకుపైగా..
దేశంలో కొత్తగా 201 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజే 183 మంది కోలుకున్నట్లు తెలిపింది.
- పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఏడాది పాటు ఫ్రీ రేషన్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలందరికీ ఏడాదిపాటు ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఏడాదికి అయ్యే దాదాపు రూ.2 లక్షల కోట్ల భారాన్ని కేంద్రమే భరించనుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
- మెదడు క్యాన్సర్ ఇక మెడ వంచాల్సిందే.. మహమ్మారి వ్యాప్తికి కళ్లెం!
అమెరికా శాస్త్రవేత్తలు.. మెదడును పట్టిపీడించే ప్రమాదకరమైన క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స దిశగా కీలక ఆవిష్కరణ చేశారు. ఈ వ్యాధి దూకుడుకు అసలు కారణాన్ని గుర్తించి.. దాని జోరును అడ్డుకునే దిశగా అడుగులు వేశారు. అసలేంటా క్యాన్సర్.. దాని లక్షణాలేంటో తెలుసుకుందామా మరి..!
- రెండున్నర గంటల ఛార్జింగ్ చేస్తే చాలు.. 500 కి.మీ దూరం ప్రయాణం!
ఒకసారి ఛార్జింగ్‌తో 500 కి.మీ వెళ్లే అధునాతన ఏసీ విద్యుత్తు బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ అభివృద్ధి చేసింది. తొలితరం విద్యుత్ బస్సులు అయితే.. దాదాపుగా 3-4 గంటలు ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించేవి. కానీ సాంకేతికత వృద్ధి చెందడం వల్ల రెండున్నర గంటలు ఛార్జింగ్ చేస్తే చాలు. ఆ వివరాలేంటో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి.ప్రదీప్ మాటల్లోనే తెలుసుకోండి మరి..!
- అది అయ్యర్ అంటే భలే సమాధానమిచ్చాడుగా!
తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చాడు టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ఏం చెప్పాడంటే..
- కైకాలను కడసారి చూసేందుకు తరలివస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు..
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు తుది నివాళులు అర్పించేందుకు ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.