25 స్థానాల్లో గెలిపించండి.. ప్రధాని ఎవరోబాబే నిర్ణయిస్తారు
'చిన్నపిల్లలకు వాహన తాళాలు కూడా ఇవ్వం... అలాంటిది 31 కేసులన్న వ్యక్తికి ఆంధ్రా రాష్ట్రాన్ని అప్పగిస్తామా' అని ప్రశ్నించారు. ప్రజల తీర్పుపైనేరాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందన్నారు.25 పార్లమెంట్ స్థానాల్లో తెదేపా గెలిస్తే.. ప్రధాని ఎవరనేది చంద్రబాబు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తర్వాత మందస మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి సిద్ధమైన తనకు.. ముందుగా స్ఫురించిందిమందాస ప్రాంతమే.... అని లోకేష్ చెప్పారు.