AP Minister Seediri Appalaraju fire on Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజలు ఇవ్వాలే తప్ప.. అడుక్కుంటే రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర మంత్రులు విమర్శల దాడికి దిగారు. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ కళా వేదిక వద్ద ఓ కార్యక్రమానికి హజరైన మంత్రి సీదిరి.. పవన్ కల్యాణ్‌పై, వారాహి యాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి తామేందుకు భయపడాలని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ యాత్ర చేస్తున్నది ఎమ్మెల్యేగా గెలవడానికా..? లేక ఎమ్మెల్యేలను గెలిపించడానికా..? అన్నది ఆయనకే స్పష్టత ఉండాలని మంత్రి హితవు పలికారు. 2019 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తెర వెనుక కలిసే ఉన్నారనీ.. జనం ముందు నాటకాలు ఆడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
''మొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నన్ను ఎవడు ఆపేది అసెంబ్లీకి వెళ్లడానికి..ఈసారి ఎమ్మెల్యేగా కచ్చితంగా గెలిచి తీరుతానన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా గెలవాలంటే ముందు ఆయనది ఏ నియోజకవర్గమో డిసైడ్ చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకోకుండానే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఎట్లా ప్రజలు గెలిపిస్తారు. తాజాగా చెప్పులు గురించి పవన్ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. చెప్పులు మార్చిపోతే తెచ్చుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. కానీ పార్టీ గుర్తే పోతే ఎలా..ముందు దాని గురించి ఆలోచించండి. -'' సీదిరి రాజు, పశు సంవర్థక శాఖ మంత్రి
పవన్‌పై మరో మంత్రి విమర్శల దాడి.. మరోపక్క పవన్ కల్యాణ్ సభలకు జనం కరువయ్యారని.. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా తునిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దాడిశెట్టి.. పవన్.. సీఎం అయిపోవాలని తాను డిసైడ్ అయ్యానని వ్యాఖ్యానించడం చాలా విడ్డురంగా ఉందన్నారు. సీఎం అవ్వాలంటే ఆయన (పవన్ కల్యాణ్) డిసైడ్ అయితే సరిపోదని, ముందు ప్రజలు ఒప్పుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. పవన్‌ను ఎమ్మెల్యే చేయడానికి కూడా జనం సిద్ధంగా లేరన్నారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తారో పవన్‌కే ఓ స్పష్టత లేదని విమర్శించారు. అనంతరం ఆరుద్ర వ్యవహారంలో తనపై వస్తున్న విమర్శలపైనా మంత్రి స్పందించారు. తనకు ఆరుద్రకు సంబంధం, బాధ్యత ఏమిటని ఆయన ఫైర్ అయ్యారు.
''నా వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన వ్యక్తి తప్పు చేస్తే.. నాకు ఎలా బాధ్యత అవుతుంది. నా దగ్గర 30 మంది ప్రభుత్వం గన్‌మెన్‌లు ఉన్నారు. వాళ్ళ చరిత్ర నాకేల తెలుస్తుంది. గన్‌మెన్ ప్రవర్తన బాగోలేదని నా వద్ద నుంచి ఆ గన్‌మెన్‌ను ప్రభుత్వమే తొలగించింది.''-దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి