శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వివిధ గ్రామాల్లో తితిలి తుపాను కారణంగా ఖరీఫ్ వరి పంట రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో.. తుఫాను కారణంగా పంట నీట మునిగింది. కొంత ఉన్నప్పటికీ వాటిని కోసి కుప్పలుగా పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం మద్దతు కల్పించకపోవటంతో పంటను పశువులు తింటున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో వరికుప్పలు, వరి ధాన్యం బస్తాలు ఇప్పటికీ అలాగే ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంట పొలాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి