శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి రైల్వే అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఫొని తుపాన్ కారణంగా నేడు, రేపు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్లే రైళ్లు భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్లే 74 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తుఫాను తీవ్రంగా ఉంటుందని ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్ రాజు తెలిపారు. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం మీదుగా భువనేశ్వర్ వెళ్లే రైళ్లు, భువనేశ్వర్ నుంచి శ్రీకాకుళం మీదుగా విశాఖపట్నం వెళ్లే రైళ్లు రద్దుచేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆయా తేదీల్లో ప్రయాణించే ప్రయాణికులు రైల్వే అధికారులను సంప్రదించాలని కోరారు.
ఇవీ చదవండి