శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నం తీరంలో బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యమైంది. ఆదివారం కావడంతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాజసింహ, అబిద్ , సుధీర్, శివరామరెడ్డి, సంజయ్, నారాయణ పండాలు శ్రీకాకుళం నుంచి కళింగపట్నం తీరానికి వెళ్లారు. రాజసింహ ఒడ్డుపై ఉండగా ఐదుగురు విద్యార్థులు సముద్రంలోకి దిగారు. సముద్రపు పోటు ఎక్కువగా ఉండడంతో ఐదుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. వీరిలో అబిద్ని మైరైన్ సిబ్బంది బయటకు తీసుకురాగా.. అనంతరం సుధీర్ మృతదేహాన్ని వెలికితీశారు. బందరువాని పేట దగ్గర మరో విద్యార్థి శివరామరెడ్డి మృతదేహం లభ్యమైంది. విద్యార్థులు తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన సంజయ్, నారాయణ పండా కోసం మెరైన్ పోలీసులు, కోస్టుగార్డు సిబ్బంది గాలిస్తున్నారు.
బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యం - శ్రీకాకుళం జిల్లాకళింగపట్నం తీరం తాజా వార్తలు
కళింగపట్నం తీరంలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యమైంది.గల్లంతైన ఇద్దరు విద్యార్థుల కోసం కోస్టుగార్డు సిబ్బంది గాలిస్తున్నారు.