రాత్రి వేళ ఊరు కాని ఊరిలో నడిరోడ్డుపై అంబులెన్స్ సిబ్బంది వదిలేసిన ఘటన.. శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. జిల్లాలోని మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ఓ తల్లి, కుమార్తెతో పాటు మరో వ్యక్తిని ఈనెల 16న కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయంటూ... శ్రీకాకుళం పాత్రునివలస క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే పరీక్షలు నిర్వహించిన వీరికి కరోనా పాజిటివ్ లేకపోవడంతో అధికారులు అంబులెన్స్‌లో పంపించారు.
పలాసలో దిగిపోవాలని అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. తాము చాపర వెళ్లాలని సిబ్బందికి చెప్పినా... వజ్రపుకొత్తూరు మండలం సరిహద్దు బెండిగేటు వద్ద రాత్రి 9గంటలకు అంబులెన్స్ సిబ్బంది దించేసి వెళ్లిపోయారు. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న వెంకటాపురం గ్రామానికి చేరుకుని... ఫోన్ ద్వారా ఇంటికి సమాచారం అందించారు. క్వారంటైన్ నుంచి రావడంతో వీరిని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు వారికి తెలిసిన బంధువుల వాహనంలో అర్ధరాత్రి సమయంలో బాధితులు బయలుదేరి వెళ్లారు.
ఇదీ చదవండి: