ETV Bharat / state

అగ్నిపథ్‌ నిరసనలు.. శ్రీకాకుళం, విజయనగరం రైల్వేస్టేషన్లలో హైఅలర్ట్​ - అగ్నిపథ్‌ నిరసనల వార్తలు

High Alerts at Railway Stations: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో నిరసనలు మిన్నంటుతున్న వేళ... రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకుకుళం జిల్లాల్లోని రైల్వేస్టేషన్లలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని గుర్తించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

High Alerts
High Alerts
author img

By

Published : Jun 18, 2022, 12:50 PM IST

High Alerts at Railway Stations: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్​లో ఆందోళనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకుకుళం జిల్లాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఆందోళనకారులు మూకుమ్మడిగా రైల్వే స్టేషన్​లోకి ప్రవేశించకుండా.. ప్రధాన ద్వారాల్లో ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. జిల్లాల్లోని విజయనగరం, కొత్తవలస, ఆమదాలవలస, శ్రీకాకుళం.. వంటి ప్రధాన స్టేషన్లలో అదనపు బలగాలను మోహరించారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని గుర్తించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు ప్రయాణికులను కొత్తవలసలో నిలిపివేస్తున్నారు. ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కొత్తవలసలో దిగిన వారికి అక్కడినుంచి ప్రయాణించాల్సిన దూరానికి సంబంధించిన రైలుచార్జీలను తిరిగి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు.

శ్రీకాకుళం, ఆమదాలవలస రైల్వేస్టేషన్లలో రైళ్లను అడ్డుకోవటానికి ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.