శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శుక్రవారం జరిగిన చైన్ దొంగతనం కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని అదనపు క్రైం ఎస్పీ విఠలేశ్వరరావు... పోలీస్ అధికారులను ఆదేశించారు. వరుస దొంగతనాలు జరిగిన ప్రదేశాల్లో అదనపు ఎస్పీ పర్యటించారు. బాధితులను పిలిపించి దొంగల ప్రవర్తన గురించి ఆరా తీశారు.
గొలుసు చోరీకి గురైన బాధితురాలు నారాయణమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగను గుర్తించేందుకు అవకాశం ఉందని తెలిపారు. వరుస దొంగతనాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీఐ ప్రసాద్ రావు, ఎస్సై కోటేశ్వరరావును ఆదేశించారు. వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: