ETV Bharat / state

ఈఎస్​ఐ కేసు: పితాని మాజీ పీఎస్​కు 14 రోజుల రిమాండ్ - pithani satyanarayana on esi scam

ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలు అవకతవకల కేసులో మాజీ మంత్రి పితాని పీఎస్​ మురళీమోహన్‌ను అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. మురళీమోహన్​ను కొంతసేపు విచారించిన అనిశా అధికారులు... అనంతరం న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి..మురళీమోహన్​కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.

ACB authorities detain former minister Pitani Satyanarayana former PS
అనిశా అధికారులు అదుపులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్
author img

By

Published : Jul 10, 2020, 4:38 PM IST

Updated : Jul 11, 2020, 1:59 AM IST

పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్‌ను అనిశా అధికారులు సచివాలయంలో అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు తరువాత పితాని సత్యనారాయణ కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనూ అక్రమాలు కొనసాగినట్లు ఆరోపణలు రావడంతో వీటిపై విచారించారు. అప్పటి ఈఎస్​ఐ డైరెక్టర్, సిబ్బందితో కలిసి ఔషధాల కొనుగోలు చేశారని గుర్తించారు. అధిక ధరలకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి నష్టం వచ్చిందని అనిశా దర్యాప్తులో తేలింది. పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేశ్​తో పాటు మురళి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇది హైకోర్టులో పెండింగ్​లో ఉంది. ఈ నేపథ్యంలోనే మురళీని అధికారులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనిశా న్యాయమూర్తి...మురళీమోహన్​కు 14 రోజులు రిమాండ్ విధించారు.

ఇదీ చదవండి: 'రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం'

Last Updated : Jul 11, 2020, 1:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.