ETV Bharat / state

టెక్కలిలో మాయ లేడి... ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ!

నిరుద్యోగుల ఆశలే ఆమె పెట్టుబడి. తన చేతిలో అధికారులు, నాయకులు ఉన్నారంటూ మాటల గారడీతో ఎదుటివారిని బుట్టలో వేసుకుని కుచ్చుటోపీ పెట్టడం ఆమెకున్న నైపుణ్యం. ఈక్రమంలో ఒకరు కాదు..ఇద్దరు కాదు..తీగ లాగుతూ వెళితే మోసపోయిన వారి సంఖ్య ఎక్కువే కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్న ఈ తంతు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

tekkali crime
tekkali crime
author img

By

Published : Oct 25, 2020, 5:28 AM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు నిరుద్యోగులకు ఆశ పెట్టి వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడింది. ప్రభుత్వ సంస్థల్లో అటెండర్‌ పోస్టు వేయిస్తానని, తనకు ఐఏఎస్‌ అధికారులు, ప్రముఖ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని నమ్మించింది. ఈ క్రమంలో ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేసింది. ఇది జరిగి చాలాకాలమవుతున్నా ఉద్యోగ ఉత్తర్వులు రాకపోతుండటంతో నిరుద్యోగులు ఒక్కొక్కరుగా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. 'ఇదిగో ఏ క్షణంలోనైనా ఫ్యాక్స్‌ ఉత్తర్వులు మీకు వచ్చేస్తాయి. ఇంకెవరికీ చెప్పొద్దు' అంటూ బాధితులను నమ్మించింది. మరికొందరితో 'సంబంధిత అధికారి వద్దనే ఉన్నాను. మీ పని జరుగుతుంది. కావాలంటే మాట్లాడు' అంటూ ఫోన్లో అపరిచిత వ్యక్తులతో మాట్లాడించేది.

ఎదురు తిరిగితే దుర్భాషలు.. లేకపోతే రాజీ..!

అభ్యర్థుల ఆర్థిక పరిస్థితిని బట్టి గట్టిగా తిరగబడితే దుర్భాషలాడుతూ ఎదురుదాడికి దిగిన సందర్భాలూ ఉన్నాయి. ఆమె తమతో ప్రవర్తించిన తీరును, భాషను బాధితులు ఫోన్లో నిక్షిప్తం చేసి పోలీసుల వద్ద వినిపించి తమ గోడును వెలిబుచ్చారు. అయితే విషయం బయటకు పొక్కుతుందనే పరిస్థితులు ఉన్నవారికి సగం డబ్బులిచ్చి మిగిలిన సగాన్ని కొంతకాలమయ్యాక ఇస్తానంటూ పోలీస్‌స్టేషన్లోనే రాజీ కుదుర్చుకున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా లింగాలవలసకు చెందిన ఓ యువకుడు టెక్కలి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు పిలిపించగా గతంలో జరిగిన పరిణామాలను ఆమె వివరించింది. గతంలోలాగే బాధితులతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నానికి అంతా అంగీకారానికి వచ్చి కొంత గడువు కోరారు. ఈ విషయం బయటకు పొక్కటంతో ఆమె బారినపడిన 20 మంది వరకు నిరుద్యోగులు బయటకొచ్చారు. ప్రతిఒక్కరూ రూ.5 లక్షల వరకు ముట్టజెప్పామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. సుమారుగా రూ.కోటి పైనే నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై టెక్కలి ఎస్‌ఐ కామేశ్వరరావును సంప్రదించగా విషయం తన దృష్టికి వచ్చిందని, ఇరువర్గాలు రాజీకోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. గతంలో పలువురికి ఆమె చెల్లింపులు జరిపినట్లు చెబుతుండటంతో కొంత సమయం ఇచ్చామని, బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి

విజయవాడ యువతి హత్య కేసులో కీలక మలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.