శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రెండు బుల్లెట్ వాహనాలను దొంగలించిన కేసులో ఓ యువకుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆటో నడుపుతూ జీవిస్తున్న అతను మద్యం, క్రికెట్ బెట్టింగ్ తదితర వ్యసనాలకు బానిసై 2014లో చోరీలు చేస్తున్నాడు. విజయనగరం జిల్లా గజపతినగరం లో చోరీలు చేయడం ప్రారంభించి విశాఖపట్నంలో లో ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడి అరెస్టయ్యాడు ఇలా పలుమార్లు బెయిల్పై రావడం, చోరీలకు పాల్పడటం అలవాటుగా మారింది.
నెల్లూరు జిల్లాలో గంజాయి రవాణా చేస్తూ రెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అలాగే విశాఖ జిల్లాలో ఆరిలోవ ప్రాంతంలో 5 స్కూటీలు దొంగిలించి అరెస్టయ్యాడు . 2017లో తన దొంగతనం తీరులో మార్పులు చేసి శ్రీకాకుళంలో దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. విశాఖ జిల్లా ఎండాడ ప్రాంతంలో బంగారు నగలు చోరీకి పాల్పడ్డాడు . ఇలా చోరీలు చేస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు ఈనెల 13, 20 తేదీల్లో నరసన్నపేట లో 2 బుల్లెట్ ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. ఈ క్రమంలో నరసన్నపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ సీసీ కెమెరాల ద్వారా సమాచారం సేకరించారు. ఎట్టకేలకు ఆ యువకుని మంగళవారం ఉదయం అరెస్టు చేసినట్టు సీఐ తిరుపతి రావు తెలిపారు.
ఇదీ చదవండి: 'సారాబారిన పడి జీవితాలు నాశనం చేసుకోకండి'