MLC candidate Ravindra Reddy: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని యాదవ కళ్యాణ మండపంలో గత రెండు రోజులుగా శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైతిక విలువలు బోధించడం పట్ల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న పశ్చిమ రాయలసీమ వైసీపీ పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఉపాధ్యాయుల శిక్షణ భవనం వద్దకు చేరుకున్నారు. భవనం లోపలికి ప్రవేశించే సమయంలో లోనికి రాకూడదని ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. చేసేదీలేక రవీందర్ రెడ్డి బయటే వేచి ఉన్నారు.
టీ విరామ సమయంలో ఉపాధ్యాయులు బయటికి రాగా వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి ఉపాధ్యాయులతో ఓట్లను అభ్యర్థించారు. ఉపాధ్యాయుల ఏ ఒక్క సమస్యనైనా ప్రభుత్వం పరిష్కరించిందా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్రారెడ్డిని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. తడబడుతూ వంద శాతం హామీలు నెరవేర్చామని మేము ఎక్కడ చెప్పలేదని రవీంద్రారెడ్డి ఉపాధ్యాయులకు డొంక తిరుగుడు సమాధానం చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి: