ETV Bharat / state

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్​ఎంపీ వైద్యుడి ఇంజక్షన్​ వికటించి ఇద్దరు మృతి..

Died due to injection: కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు.. మోకీలు నొప్పులతో బాధపడుతూ ఆర్​ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా, ఆర్​ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్​ వికటించి ఇద్దరు వ్యక్తులు మరణించారు. శ్రీ సత్య సాయి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు మోకీలు నొప్పులతో బాధపడుతూ ఆర్​ఏంపీ వద్ద ఇంజక్షన్​ తీసుకున్నమని బాధితులు వాపోతున్నారు. వారిలో ఇద్దరు మరణించారు. అసలు ఏం జరిగిందంటే..

Injection
ఇంజక్షన్​
author img

By

Published : Dec 10, 2022, 12:38 PM IST

RMP Injection Incident: శ్రీసత్యసాయి జిల్లా ఓడిసి మండలం టీ కుంట్లపల్లి, బసప్పగారిపల్లె గ్రామాల్లో మోకీలు నొప్పుల చికిత్స కోసమంటూ.. ఓ ఆర్​ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్​ వికటించి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీ కుంట్లపల్లి, బసప్పగారిపల్లితో పాటు పలు గ్రామాలకు చెందిన మోకీలు నొప్పులతో బాధపడుతున్న దాదాపు 30 మంది.. అమడగూరు మండలం పులకుంట్లపల్లిలోని ఆర్​ఎంపీ వైద్యుడి వద్ద సూది మందు తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీన సూది మందు తీసుకోగా.. ఆర్​ఎంపీ వైద్యుడు చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందిన వ్యక్తి అని స్థానికులు తెలిపారు.

సూది మందు తీసుకున్న రోజు నుంచీ కుంట్లపల్లి, బసప్పగారిపల్లికి చెందిన బాధితులకు మోకీలు నొప్పులు మరింత అధికమవడంతోపాటు.. విపరీతంగా వాపు రావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యామని తెలిపారు. వీరిలో పప్పురమ్మ, రామప్ప పరిస్థితి విషమించి మరణించారు. మిగతావారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో.. ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పప్పురమ్మ, రామప్ప మృతితో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్​ఎంపీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.