ETV Bharat / state

శంకరా.. మా ప్రశ్నకు సమాధానమేది..?

MLA in Gadapa Gadapa program: శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని తురకలాపట్నం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శంకర్ నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథాలు చేపట్టిందో చెప్పాలంటూ.. టీఎన్ఎస్ఎఫ్ నేత హరికృష్ణ ఎమ్మెల్యేను నిలదీశారు. హరికృష్ణ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Gadapa Gadapa
గడప గడప
author img

By

Published : Jan 11, 2023, 7:41 PM IST

వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ

TNSF leader Harikrishna: సీఎం జగన్ తన ఎమ్మెల్యేలకు గడప గడపకు వెళ్లాలంటూ ఆదేశిస్తున్నారు. ఎమ్మెల్యేలకు మాత్రం గడప గడపలో ప్రశ్నల వర్షం తప్పడంలేదు. వెళ్లకుంటే ముఖ్యమంత్రి ఊరుకోవడం లేదు.. వెళ్తే ప్రజలనుంచి వ్యతిరేకత తప్పడంలేదు. ఇప్పడు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ప్రజల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తమ సమస్యలపై ప్రశ్నించిన వారిపై దాడి చేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. ఇలాంటి వెలుగు చూడని ఘటనలు అనేకం ఉన్నాయి.

ఎమ్మెల్యేని ప్రశ్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేత: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరికృష్ణ ఎమ్మెల్యేను నిలదీశారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని తురకలాపట్నం గ్రామంలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వము అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గురించి తెలియజేస్తూ వెళుతున్నారు. ఈ క్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు హరికృష్ణ ఇంటి వద్దకు రాగానే ఎమ్మెల్యేను హరికృష్ణ గ్రామంలోని సమస్యలపై నిలదీశారు. హరికృష్ణ ప్రశ్నిస్తుండడంతో అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెను తిరిగి వెళ్లిపోయారు.

వైసీపీ నాయకుడు అడ్డకునే ప్రయత్నం: అయితే ఎమ్మెల్యేను తమ సమస్యలపై హరికృష్ణ ప్రశ్నిస్తున్న సమయంలో పక్కనే ఉన్న స్థానికి వైసీపీ నాయకుడు అడ్డకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించేందుకే గడప గడపకు అంటూ వచ్చి.. ఇప్పడు తమ సమస్యలపై ప్రశ్నించకూడదు అంటే ఎలా అంటూ నిలదీశారు. హరికృష్ణ ప్రశ్నలకు ఎమ్మెల్యే శంకర్ నారాయణ సమాధానం చెప్పే సమయంలో అక్కడే ఉన్న పోలీస్ సిబ్భంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫోన్​లలో వీడియో తీస్తున్నవారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పా? అంటూ హరికృష్ణ స్థానిక వైసీపీ నేతలను ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే తమ గ్రామానికి చేసిందేంటో చెప్పాలి ఆయన ప్రశ్నించారు.

గత కొన్ని రోజులుగా గడప గడపకు అంటూ ఆయా ప్రాంతాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను స్థానికులు ప్రశ్నించడం పరిపాటిగా మారిపోయింది.. అలాంటి సందర్భాల్లో సామాన్య ప్రజలపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఎమ్మెల్యేల అనుచరులు ప్రశ్నించిన వారిని దూషించడమో లేదా దాడులు చేయడమో జరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.