ETV Bharat / state

ముగిసిన బీఫార్మసీ విద్యార్థిని.. తేజస్విని అంత్యక్రియలు

Protest: బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని రీ-పోస్టుమార్టం అంత్యక్రియలు ముగిశాయి. అయితే.. మృతదేహాన్ని పోలీసులు అడ్డదారిలో తరలించడంపై బంధువులు, స్థానికులు పోలీసులను నిలదీశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి తరఫు బంధువులు తేజస్విని మృతికి కారకుడిగా భావిస్తున్న సాధిక్ ఇంటి తలుపులు పగలగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

protest at penukonda hospital over B Pharmacy student suspicious death
బీఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఆందోళన
author img

By

Published : May 6, 2022, 1:44 PM IST

Updated : May 6, 2022, 7:37 PM IST

Protest: బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని రీ పోస్టుమార్టం తర్వాత పోలీసులు మృతదేహాన్ని అడ్డదారిలో తరలించడంతో గోరంట్లలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని అడ్డదారిలో తరలించడంపై పోలీసులను నిలదీశారు. మృతురాలి తరఫున బంధువులు తేజస్విని మృతికి కారకుడైన సాదిక్ ఇంటి తలుపులు పగలగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సాదిక్ ఇంటి వద్దకు చేరుకొని బంధువులను పంపించేశారు. అనంతరం మృతురాలి కుటుంబానికి సంబంధించిన పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

బీఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఆందోళన

వాల్మీకి సంఘ నాయకుల ఆందోళన: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతిపై తెదేపా నేతలు, వాల్మీకి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ వాహనాన్ని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు, వాల్మీకి సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వాల్మీకి సంఘాల నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు.

అసలేం జరిగిందంటే..? : తిరుపతిలో బీ.ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న యువతి తేజస్విని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రియుడుగా చెబుతున్న సాదిక్​కు సంబంధించిన వ్యవసాయ షెడ్డులో ఉరి వేసుకొని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త వెలుగుచూసింది. యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాచారం తెలుసుకున్న గోరంట్ల పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగల కొట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం.. గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పెట్రో బాదుడుతో దండిగా రాబడి.. ఆ ధరల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ

Last Updated : May 6, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.