ETV Bharat / state

దారి చూపాల్సిన వారే పక్కదారి.. ఓటు కోసం ఫోర్జరీ చేసిన ఉపాధ్యాయులు

Illegal Registration of Votes: ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అక్రమ పద్ధతిలో ఓటర్లుగా చేరిన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పెనుకొండ ప్రాంతాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

Forgery for MLC vote
ఎమ్మెల్సీ ఓటు కోసం ఫోర్జరీ
author img

By

Published : Feb 27, 2023, 11:14 AM IST

Illegal Vote Registration in MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అక్రమ పద్ధతిలో ఓటర్లుగా చేరిన వివిధ పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేశారు. ఓటు కోసం జిల్లా విద్యాశాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఘనగిరి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ నమోదు కోసం డీఈవో సంతకం ఫోర్జరీ చేసిన ఘటన చోటుచోసుకుంది. దీనిపై కేసు నమోదు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నిర్మల, రాజేశ్వరి.. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడం కోసం జిల్లా విద్యాశాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇరువురిపై శనివారం రాత్రి పెనుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అధికారులు సమాచారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లాలోనే హిందూపురం పట్టణంలోని అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ నిర్వహణలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫోర్జరీ చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నారని.. ఎన్నికల నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న హిందూపురం మండలం ఇంచార్జ్ తాహసీల్దార్ సౌజన్య లక్ష్మి ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

వీరితోపాటు కదిరిలోని బ్లూమాన్‌ పాఠశాలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు, సాధన పాఠశాలకు చెందిన మరొకరు డీఈవో సంతకాలు లేకుండానే ఓటు కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇలా ఒక్కొక్కటిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు బయట పడుతున్నాయి. దీనిపై అధికారులు వివరాలు వెల్లడించేందుకు ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.