Nidigallu TDP Public Meeting Updates: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు ఫ్యాక్షనిజం విస్తరించిందని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లులో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతుల తోటల్లో చెట్లు నరుక్కునే సంప్రదాయం శ్రీకాకుళం జిల్లాకు వ్యాపించిందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు విచక్షణ కోల్పోయి..పేదలు, దళితులపై ఫ్యాక్షన్ తరహా దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
Paritala Sriram Innovative Program on Tree Cutting: రాజకీయ కక్షలతో ప్రత్యర్థులైన రైతుల తోటల్లో పండ్ల చెట్లను నరికి, ఆర్థిక నష్టం చేయటానికి వ్యతిరేకంగా.. ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గత వారం రోజులుగా గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ చేసి, కక్షలతో రైతులకు నష్టం చేకూర్చొద్దంటూ వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. మొక్కల పంపిణీ ముగింపు సందర్భంగా గురువారం తాడిమర్రి మండలం నిడిగల్లులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సీఎం జగన్పై సీఐడీకి మేదర కులస్తుల ఫిర్యాదు - ఎందుకంటే ?
MP Rammohan Naidu Comments: రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..''గతంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే ఫ్యాక్షన్ ఉండేది. కానీ, జగన్ సీఎం అయ్యాక ఈ నాలుగున్నరేళ్లలో అన్ని జిల్లాలకు అది విస్తరించింది. రైతుల తోటల్లో చెట్లు నరుక్కునే సంప్రదాయం శ్రీకాకుళం జిల్లాకు కూడా వ్యాపించింది. వైసీపీ నాయకులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. గతకొన్ని నాలుగేళ్లుగా ఫ్యాక్షన్ తరహా దాడులు జరుగుతున్నాయి. వయసులో చిన్నవాడైనా పరిటాల శ్రీరామ్ ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా రైతులకు అండగా నిలుస్తున్నారు'' అని ఆయన అన్నారు.
Kalava Srinivasulu, Paritala Sunitha Comments: మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీతలు ప్రసంగిస్తూ.. ఒక్క చెట్టు నరికితే పది చెట్లు నాటుతామని, పది నరికితే వందచెట్లు నాటి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరిటాల రవీంద్ర ఆశయాలను కొనసాగిస్తామని, పేదలకు అండగా నిలుస్తామని తెలిపారు. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 'వైసీపీని ఇంటికి పంపిద్దాం-తెలుగుదేశం పార్టీని గెలుపించుకుందాం' అని నేతలు పిలుపునిచ్చారు.
టీడీపీ నేత నల్లమిల్లి ఇంటి వద్ద దుండగులు హల్‌చల్ - అనపర్తి పీఎస్‌లో ఫిర్యాదు
జగన్ సీఎం అయ్యాక ఏపీలో రోజురోజుకి ఫ్యాక్షన్ విస్తరించింది. ఈ నాలుగున్నరేళ్లలో ఫ్యాక్షన్ పడగవిప్పింది. వ్యక్తిగత కక్షలతో చెట్లు నరుకుతున్నారు. చెట్లు నరకడం దుర్మార్గం. ఇప్పటికైనా వైసీపీ నేతలు మేల్కొని రైతులకు, రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని, రైతులను అభివృద్ధిలోకి తీసుకొస్తాం. -టీడీపీ నేతలు
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్ - ఈ నెల 24న విచారణ చేపడతామన్న ధర్మాసనం