ETV Bharat / state

"గడప గడప"లో.. మాజీ మంత్రికి సెగ - MLA Shankara Narayana in Gadapa gadapa program at Mcherlopalli village

MLA Shankara Narayana in Gadapa gadapa: రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా.. 'గడప గడపకు..' కార్యక్రమంలో నాయకులకు ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకరనారయణకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. సహనం కోల్పోయిన ఆయన చేద్దాం.. చూద్దాం.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

MLA Shankara Narayana
MLA Shankara Narayana
author img

By

Published : May 25, 2022, 2:24 PM IST

MLA Shankara Narayana in Gadapa gadapa: శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న 'గడప గడపకు...' కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకరనారాయణ పాల్గొన్నారు. తమ నివాసాలకు వచ్చిన ఆయనకు గ్రామ యువకులు.. గ్రామ సమస్యలు ఏకరువు పెట్టారు. గ్రామంలో రోడ్లు లేవని, డ్రైనేజీలు వ్యవస్థ లేదని తెలిపారు. వారి సమస్యలను విన్న శంకర నారాయణ సహనం కోల్పోయారు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏమి చేయలేక పోయారు.. ఒక్కొక్కటే చేద్దాంలే అంటూ అక్కడి నుంచి జారుకున్నారు. ఎమ్మెల్యే అయివుండి సమస్యలను పట్టించుకోకుండా.. సరైన సమాధానం ఇవ్వకుండా శంకరనారాయణ వెళ్ళిపోవడం అక్కడి వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. సమస్యలకు సరైన పరిష్కారం చూపాలంటూ యువకులు ముందుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని వారించారు.

మాజీ మంత్రికి 'గడప..' సెగ.. దాటవేస్తూ వెళ్లిన వైనం...

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.