ETV Bharat / state

అనంత వైసీపీలో అసమ్మతి సెగలు.. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌పైనే చెప్పులు - శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ వైకాపా

Minister Peddireddy Ramachandra Reddy:ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార వైకాపాలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. ‍‍‌మంత్రి పెద్దిరెడ్డి నిర్వహిస్తున్న నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాల్లో, అసమ్మతి వర్గం తమకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తోంది. పుటపర్తిలో ఏకంగాపెద్దిరెడ్డి కాన్వాయ్‌పైనే అసమ్మతివర్గం చెప్పులు విసిరింది.

Peddireddy
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
author img

By

Published : Dec 17, 2022, 10:22 PM IST

Minister Peddireddy Ramachandra Reddy :ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార వైకాపాలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి.‍‍‌ మంత్రి పెద్దిరెడ్డి నిర్వహిస్తున్న నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాల్లో అసమ్మతి వర్గం తమకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తోంది. పుటపర్తిలో ఏకంగా...పెద్దిరెడ్డి కాన్వాయ్‌పైనే శ్రీసత్యసాయిలో జిల్లాలో అధికార వైకాపాలో వర్గవిభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే అసమ్మతి నాయకులు నిరసనగళంతో నిలదీస్తున్నారు.

తాడిపత్రి, మడకశిర, హిందూపురం తరహాలోనే పుట్టపర్తిలోనూ... స్థానిక ఎమ్మెల్యే మాజీమంత్రి శంకర్‌నారాయణపై అసమ్మతి భగ్గుమంది. పెనుకొండలో వైకాపా విస్తృతస్థాయి సమావేశానికి వస్తున్న పెద్దిరెడ్డికి శంకర నారాయణపై ఫిర్యాదు చేసేందుకు ఆయన వ్యతిరేక వర్గీయులు.. శ్రీకృష్ణదేవరాయల కూడలివద్ద కాపుకాశారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గీయులు కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ రాగానే ఇరువర్గాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో.. తోపులాట జరిగింది. అసమ్మతి నేతలు మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో..పోలీసులు అందర్నీ చెదరగొట్టారు.

అనంతరం మార్కెట్ యార్డ్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అసమ్మతి నేతలను కలుపుకుని పోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ధర్మవరం వైకాపా విస్తృత స్థాయి సమావేశానికి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.పెనుకొండ, మడకశిర, తాడిపత్రి, హిందూపురంలో అసమ్మతి నేతల వరుస ఘటనలతో భారీగా పోలీసులను మోహరించారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.