ETV Bharat / state

"నిన్ను సచివాలయంలోనే ఇరగ్గొడతా.. రాసిపెట్టుకో.." ఉద్యోగికి వాలంటీర్ హెచ్చరిక! - సచివాలయ సిబ్బంది పై వాలంటీర్ దాడి

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాల్సిన గ్రామ వాలంటీర్లు.. వాళ్ల పైనున్న ఉద్యోగుల మీదనే పెత్తనం చెలాయిస్తున్నారు. 'మేము లోకల్ మా మాటే వినాలి' అంటూ ఓ వాలంటీర్ పంచాయతీ హెచ్చరించిన ఘటన.. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో చోటు చేసుకుంది.

gram volunteer attack on village sachivalayam staff at satya sai district
సచివాలయ సిబ్బంది పై వాలంటీర్ల పెత్తనం
author img

By

Published : Jun 16, 2022, 10:37 AM IST

Updated : Jun 16, 2022, 11:47 AM IST

"సచివాలయంలోనే కొడతా.. దిక్కున్నచోట చెప్పుకో" అంటూ.. సచివాలయ ఉద్యోగిపై ఓ గ్రామ వాలంటీర్ బెదిరించాడు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో జరిగిందీ ఘటన. గాండ్లపెంట మండలం మలమీదపల్లి సచివాలయంలో.. పంటల బీమా వివరాల నమోదులో అన్యాయం చేశావంటూ.. వాలంటీర్ రెచ్చిపోయాడు. సిరికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డిపై.. విజయ్ కుమార్ రెడ్డి దౌర్జన్యానికి దిగాడు.

సచివాలయ సిబ్బంది పై వాలంటీర్ల పెత్తనం

'మేము లోకల్.. మా మాటే వినాలి' అంటూ రెచ్చిపోయాడు. గ్రామస్తులు వారిస్తున్నా వినిపించుకోకుండా.. తిట్ల దండకం అందుకున్నాడు. 'సచివాలయంలోనే నిన్ను కొడతాను.. ఎవరు అడ్డువస్తారో చూస్తా. రాసి పెట్టుకో.. నాపేరు విజయ్ కుమార్ రెడ్డి సన్నాఫ్ నాగిరెడ్డి రాసుకో.. కంప్లైంట్ చేస్కో.." అంటూ ఊగిపోయాడు. దీనిపై.. మధుసూదన్ రెడ్డి ఎంపీడీవో సహా ఎస్సైకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసిగోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:

Last Updated : Jun 16, 2022, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.