ETV Bharat / state

కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. ఎక్కడంటే? - శ్రీ సత్య సాయి జిల్లా వార్తలు

Fire in Car: శ్రీ సత్యసాయి జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చాగలేరు గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినా.. కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో గ్రామస్థులంతా కలిసి సహయక చర్యలు చేపట్టడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

కారులో చెలరేగిన మంటలు
Fire broke out in a car
author img

By

Published : Jan 6, 2023, 7:52 PM IST

Fire Breaks Out From Car in AP: ఈ మధ్యకాలంలో తరచూ కారులో మంటలు వ్యాపించడం పరిపాటిగా మారిపోయింది. ఆయా కంపెనీల నాణ్యతా లోపమో, లేదా వాహనాదారుల అవగాహన లోపమో కానీ తరచూ వాహనాల్లో మంటలు చెలరేగడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతున్న ఘటనలు సైతం నమోదవుతున్నాయి. అలాంటి ఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.

గోరంట్ల మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. చిలమత్తూరు మండలం చాగలేరు గ్రామం నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారులో.. మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు కారు యజమాని వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో కారులో మెుత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

ఈ ఘటలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్న సమాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న వారు కిందికి దిగి పరిగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్థులంతా కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి అదుపుకాక కారు పూర్తిగా దగ్ధమైంది.

కారులో చెలరేగిన మంటలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.