Farmer Suicide Attempt: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. నాసన్ సంస్థకు భూమిచ్చే విషయంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన రైతు రామయ్య.. సమస్య పరిష్కారం కావట్లేదని సబ్ కలెక్టర్ ఎదుటే పురుగుల మందు తాగారు. సోమందేపల్లి మండలం కావేటినాగేపల్లికి చెందిన రామయ్య.. నాసన్‌కు మూడున్నర ఎకరాల భూమి ఇచ్చేందుకు నిరాకరించారు. సమస్యపై హైకోర్టును ఆశ్రయించగా.. రైతుకు న్యాయం చేసి భూసేకరణ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు కూల్చేశారని.. అధికారులనుంచి హామీ రాలేదంటూ రైతు పురుగులమందు తాగారు. పెనుకొండలో చికిత్స తర్వాత రైతును మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
రైతు ఆత్మహత్యాయత్నం చేస్తున్నా.. అక్కడ ఉన్న అధికారులు అడ్డుకునే యత్నం చేయలేదు. పురుగుల మందు తాగి నేలపై పడిపోయి ఉన్న రైతును.. ఎవరూ పట్టించుకోలేదు. అక్కడికి ఇతర సమస్యలపై వచ్చిన సీపీఎం నాయకులు రైతు రామయ్యకు మద్దతుగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగి.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: