Removal of TDP sympathy votes: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజవర్గంలో కొందరు బీఎల్వోలు.. టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నియోజవర్గంలోని కీలక నేత ఆదేశాలతో.. ప్రతిపక్ష పార్టీ మద్దతు దారుల ఓట్లను తొలగిస్తున్నరు. ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీలో 500 ఓట్లు తొలగించారు. ఇరికిరెడ్డిపల్లికి చెందిన తులసమ్మ వృద్ధురాలు దశాబ్దాల కాలంగా గ్రామంలోనే ఉంటుంది. ఆమె పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించారు.
అదే విధంగా గ్రామంలో మరికొంతమంది ఓట్లను తొలగించారు. నియోజవర్గ ప్రజా ప్రతినిధి గ్రామ సచివాలయాలకు వెళ్తూ.. బీఎల్వోలకు ఓట్ల తొలగింపుపై గట్టిగా.. చెప్పడంతోనే బీఎల్వోలు ఓట్ల తొలగిస్తున్నారని.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరికిరెడ్డిపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త పేరు కూడా జాబితాలో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు తొలగింపుపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు ప్రజలు వెళ్లి వస్తుంటారు. వలస వెళ్లారనే కారణం చూపి ఓట్ల తొలగించారు .ఈ గ్రామాల పరిధిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన.. వారి పేర్లు మాత్రం జాబితాలో అలాగే ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న వారి పేర్లను తొలగించడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: