CPI leaders Serious on Lepakshi Hub lands Scam: లేపాక్షి హబ్ భూములను సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మేనమామకు కట్టబెడుతున్నారని సీపీఐ నేతలు ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి హబ్ భూములను రైతులకు తిరిగివ్వాలని ఉమ్మడి అనంతపురం జిల్లా సీపీఐ నేతలు నేటి నుంచి ఆందోళనలు ప్రారంభించారు. రైతుల నుంచి చౌకగా భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టకుండా.. పక్కదారి పట్టించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని సీపీఐ పార్టీ నేతలు విమర్శించారు. పరిశ్రమలు పెట్టి ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.
ప్రభుత్వం, లేపాక్షి హబ్ యాజమాన్యం రైతులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూములు తీసుకున్న ఉద్దేశం నెరవేర్చటంలో విఫలమైనందున తిరిగి రైతులకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. నేటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో ఆందోళన నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. ఈనెల 15న లేపాక్షి హబ్ భూముల్లో నిరసన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజక్టు ఉద్దేశం నెరవేరనందున రైతుల భూములు తిరిగిచ్చే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: